జన గళం విజయవాడ బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైన వేళ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డ్) సభ్యులు మొదటి రోజు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న జగన్మాతను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూలైన్లు, ప్రసాద వితరణ, మంచినీటి వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఆలయ అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భవానీ భక్తులు, సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా పాలకమండలి సభ్యులు సమన్వయంతో సేవలందిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శోభ: మొదటి రోజు ఉత్సవాల్లో పాల్గొన్న దుర్గా మల్లేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు!
Slug: kanaka-durga-temple-trust-board-members-participate-dasara-utsavams-day-1-indrakeeladri
