జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఏలూరు జిల్లా గోపవరంలో నిర్వహించిన ఆత్మీయ విందు కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, కైకలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్) గారి తనయులు వినయ్ గారు మరియు తెంటు శ్రీనివాసరావు (వాసు) గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటయింది. ఈ వేడుకకు స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు.
ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఆత్మీయ పలకరింపులు తెలుపుకుంటూ ఉత్సాహంగా గడిపారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ అలాగే స్థానిక రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా సౌహార్ధ వాతావరణంలో చర్చలు జరిపారు. పార్టీ శ్రేణుల మధ్య పరస్పర సంబంధాలను, సమన్వయాన్ని మరింత బలపరిచేలా ఇలాంటి ఆత్మీయ కలయికలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వినయ్ మరియు తెంటు శ్రీనివాసరావు (వాసులు)లను స్థానిక శ్రేణులు ఆప్యాయంగా స్వాగతించారు. అందరితో కలిసి కాసేపు ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి అల్పాహార, భోజన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ఆత్మీయ విందు వేడుక స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.
Slug: gopavaram-ysrcp-athmeeya-vindu-dulam-vinay-tentu-vasu
