జన గళం కృష్ణా బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ తన యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా పెనమలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తగా సీనియర్ నాయకుడు శ్రీ నేరుసు కృష్ణాంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు ఆయనకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు. మరోవైపు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రకటించారు. అవనిగడ్డ అసెంబ్లీ సమన్వయకర్తలుగా మోతి వెంకటేశ్వరరావు, నక్కా విజయ్ బాబు, గుడివాక శేషు బాబు నియామకం కాగా, 32 మంది సభ్యులతో కూడిన ‘నిర్వాహక్ దళ్’ మరియు ఐదుగురు సభ్యులతో కూడిన ‘సపోర్ట్ టీం’లను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించి పార్లమెంట్ కమిటీకి అందించడం, కూటమి సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.
స్థానిక సమరానికి జనసేన కసరత్తు: పెనమలూరు సమన్వయకర్తగా నేరుసు కృష్ణాంజనేయులు.. అవనిగడ్డ అసెంబ్లీ కమిటీ ఖరారు!
Slug: ap-local-body-elections-janasena-penamaluru-nerusu-krishnanjaneyulu-avanigadda-coordination-committee
