జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, జనసేన పార్టీ రాష్ట్ర కార్యాదర్శి అమ్మిశెట్టి వాసు ఆశీస్సులతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు దాడిశెట్టి గోపాలం ఏర్పాటు చేసిన ఫ్రూట్స్ బండి ప్లాట్‌ఫామ్‌ను మరియు జన సైనికుడు కొడవకల్లు శ్రీనివాసరావు ఉపాధి వ్యాపార బండిని లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముందుకు వస్తున్న యువతకు అండగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు.
పేదరికంలో ఉన్న మరియు స్వయం ఉపాధిపై ఆధారపడి జీవించాలనుకునే యువతకు జనసేన పార్టీ నాయకులు ఎప్పుడూ వెన్నంటి ఉంటారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమ్మిశెట్టి వాసు సహకారంతో యువత సొంతంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి చెందేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశం మేరకు నియోజకవర్గంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉపాధి కల్పనా కార్యక్రమాలను కూడా క్రమం తప్పకుండా అమలు చేస్తున్నామని నాయకులు వివరించారు.
నూతనంగా వ్యాపారాలను ప్రారంభించిన దాడిశెట్టి గోపాలం మరియు కొడవకల్లు శ్రీనివాసరావు వ్యాపార రంగంలో మంచి లాభాలు ఆర్జించి ఆర్థికంగా మరింత ఎదుగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యాపారాలను ప్రారంభించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ తరఫున ఇలాంటి మరిన్ని ఉపాధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
