జన గళం కృత్తివెన్ను/మచిలీపట్నం వార్తా విభాగం: కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని కృత్తివెన్ను ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుని స్థానానికి సంబంధించి చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను (ఫారం-ఆరు) ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం అధికారికంగా విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలైన నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం మొత్తం పది మంది అభ్యర్థుల దరఖాస్తులు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు.
అధికారిక జాబితా ప్రకారం వివిధ పార్టీల అనుబంధంతో బరిలో నిలిచిన అభ్యర్థులు:
- పుల్లగూర ధనలక్ష్మి (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)
- పుల్లగూర సుబ్రహ్మణ్యం (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)
- బంగారాల రాము(లక్ష్మణరావు) (భారత్ జోడో కాంగ్రెస్)
- అల్లూరి గంగరాజు బాబు (జనసేన పార్టీ)
- కూనసాని వెంకట్ నాగబాబు (నాగు) (జనసేన పార్టీ)
- కూనసాని విజయలక్ష్మి (జనసేన పార్టీ)
- గరికపాటి శ్రీలత (జనసేన పార్టీ)
- గరికపాటి సాంబశివరావు (శివ) (జనసేన పార్టీ)
- ప్రత్తిపాటి రామాంజనేయులు (జనసేన పార్టీ)
- వలవల వెంకట సుబ్బారావు నాయుడు (రాజా) (తెలుగుదేశం పార్టీ)
ఈ జాబితా విడుదలతో కృత్తివెన్ను మండలంలో ఎన్నికల పోరు స్పష్టమైన రూపం సంతరించుకుంది. ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుండగా, గ్రామాల్లో ప్రచార వేడి మరింత రాజుకుంది.
