జన గళం పెడన వార్తా విభాగం: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో స్థానిక సంస్థల సమర వేళ జనసేన పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. వరుస చేరికలతో పెడన పట్టణంలో జనసేన పార్టీ మరింత పటిష్టమై, విజయానికి చేరువవుతోంది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదర్శాలకు, అభివృద్ధి సంక్షేమ సిద్ధాంతాలకు ఆకర్షితులై పెడన పట్టణానికి చెందిన ప్రముఖ హోటల్ వ్యాపారవేత్త అబ్దుల్ బాజీ (కేజీఎన్), కుటుంబ సభ్యుడు మహమ్మద్ ఇస్మాయిల్, వారి మిత్రులు వంగపాటి జగదీష్, వడుగు నాగబాబు, రౌతుల నాగేశ్వరరావు అధికారికంగా జనసేన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ సమన్వయకర్తలు అంకెం లక్ష్మీ శ్రీనివాస్, లింగం నాగేశ్వరరావు, వికృతి శ్రీనివాస్ బాబు నూతనంగా పార్టీలోకి చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పాలనకు, పవన్ కళ్యాణ్ నిబద్ధతకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జనసేనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన జనసేన పార్టీ నాయకులు బళ్ల గంగయ్య, వరుదు రామకృష్ణ, చోడగం సోమరాజు, సయ్యద్ షఫీ, బట్ట దివాకర్ నాయుడు, రాయపురెడ్డి నరేష్ తదితర నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
