జన గళం అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (AP MSME) చైర్మన్, నిబద్ధత కలిగిన అంబేద్కర్ వాది శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూటమి నాయకులు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) డైరెక్టర్ మండలి రాజేష్ గారు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పరితపించే అంబేద్కర్ వాదిగా, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న నాయకుడిగా శివశంకర్ గారు అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని పేర్కొన్నారు. దుర్గాభవాని అమ్మవారి దివ్య ఆశీస్సులు ఆయనపై నిరంతరం ఉండాలని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లి ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండలి రాజేష్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
