మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) డైరెక్టర్, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికిపాటి శివశంకర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే ఎంపీ బాలశౌరి భగవంతుని కృపాకటాక్షాలతో నిండు నూరేళ్ల పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్
Slug: machilipatnam-mp-vallabhaneni-balashowry-birthday-wishes-aprdc-director-garikapati-siva-sankar
