భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ పరిధిలోని పటమట లక్ష్మీపతినగర్‌లో ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లతో కలిసి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి సేవలందించాలని నేతలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పటమటలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు: ‘సేవా సంకల్ప్ అభియాన్’లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అమ్మిశెట్టి వాసు
Slug: vijayawada-east-patamata-seva-sankalp-pm-modi-birthday-minister-nadendla-mla-gadde-ammisetti-vasu
