ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలంలోని సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ గూడూరు మండల అధ్యక్షుడు కోలపల్లి రజిని కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలపాటి లక్ష్మీనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లూరి నాగబాబుతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొని వృద్ధులకు పండ్లు అందజేశారు. దేశ ప్రగతికి ప్రధాని మోదీ అందిస్తున్న విశేష సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.
Slug: pedana-guduru-sai-old-age-home-seva-sankalp-abhiyan-bjp-fruits-distribution-pm-modi-birthday
