పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు అంకెం సీతారామ్ మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈనెల 21వ తేదీ సోమవారం భీమవరంలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలతో పాటు బీసీ, ఎస్సీ, యూత్, మహిళా కాంగ్రెస్ తదితర అనుబంధ విభాగాల ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసి నియామక పత్రాలు అందుకోనున్నారు. మాజీ మంత్రి, మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్టేట్ ఫామ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ కేబీఆర్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.
Slug: west-godavari-congress-committee-swearing-in-bhimavaram-ankem-seetharam-kanumuri-bapiraju
