మచిలీపట్నం:
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ మాధవి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు.
బూత్ పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డాక్టర్ మాధవి, ఓటింగ్ సరళిని పరిశీలించి కూటమి ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలను గమనించడంతో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని సూచించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేశారు.
ఈ పర్యటనలో జనసేన, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు
