విజయవాడ: తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెటర్నరీ కాలనీ పార్క్లో ఉల్లాసంగా మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఉదయం నడకతో పాటు ప్రజల సంక్షేమం, స్థానిక అభివృద్ధి అంశాలపై ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గారు, రిటైర్డ్ ఎస్పీ మర్రి సాంబశివరావు గారు, ఫ్రైడ్స్ డాక్టర్ రవి కుమార్ గారు, నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు గారు, కృష్ణారావు గారు, మహేష్ గారు, ప్రతాప్ గారు, వెంకట్ గారు, శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రగతి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, కాలనీ పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనపై వారు పరస్పరం ఆలోచనలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో, వివిధ వర్గాల పెద్దలతో మమేకమవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
