రచన: జన గళం బిజినెస్/లోకల్ డెస్క్, విజయవాడ: సొంతింటి కలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అత్యాధునిక వుడ్ కార్వింగ్ మరియు ఇంటీరియర్ డిజైనింగ్ సేవలను ‘లీలా ఉడ్ కార్వింగ్ వర్క్స్’ విజయవాడ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భవన నిర్మాణాలలో ప్రధాన ద్వారాలు (మెయిన్ డోర్స్), పూజా మందిరాలు, ఇంటీరియర్లకు ప్రత్యేకమైన కళాత్మక రూపాన్ని అందించేందుకు అధునాతన సాంకేతికతతో వినియోగదారులకు నచ్చిన రీతిలో డోర్లపై విశేషమైన డిజైన్లను చెక్కి అందిస్తున్నారు.
వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కేవలం రూ. 1,000 నుంచే మెయిన్ డోర్ డిజైన్ పనులను ప్రారంభించి అత్యంత సరసమైన ధరలకే నాణ్యమైన సేవలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లీలా ఉడ్ కార్వింగ్ వర్క్స్ లో ప్రత్యేకంగా జాలి వర్క్స్, బైసన్ బోర్డ్స్, ఎక్రిలిక్ షీట్స్ కటింగ్ తో పాటు ఆధునిక భవనాల బాహ్య సౌందర్యానికి ఉపకరించే WPC, ACP సెరాబోర్డ్ ఎలివేషన్ పనులను నైపుణ్యం కలిగిన నిపుణుల ద్వారా అత్యున్నత ప్రమాణాలతో చేపడుతున్నారు. ఆకర్షణీయమైన వినాయకుడు, లక్ష్మీదేవి దేవతామూర్తుల ఆకృతులు, సాంప్రదాయ చెక్కడాలు, మోడరన్ జామెట్రిక్ డిజైన్లతో కూడిన తలుపులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు, ఆర్డర్ల కోసం నిర్వాహకులు ఆర్. భాను (89776 66999), వి. జీవ (80999 94494)లను సంప్రదించవచ్చని, లేదా డోర్ నెం: 10-23, పండరీపురం 1వ లైను, మెగా ఎస్టేట్స్ రోడ్డు, పప్పులమిల్లు సెంటర్, అశోక్ నగర్, విజయవాడ చిరునామాలో నేరుగా సందర్శించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
