తిరువూరు పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు నిమిత్తం 28 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు ప్రచురించారు.
🔹 ముసాయిదా ప్రచురణ తేదీ: 14.09.2026
🔹 జాబితా అందుబాటులో ఉన్న ప్రదేశాలు: తిరువూరు RDO కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, పురపాలక సంఘం కార్యాలయం.
🔹 అభ్యంతరాల సమర్పణ గడువు: 17.09.2026 లోపు
ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, మార్పులు లేదా చేర్పులు ఉంటే సంబంధిత పౌరులు ఫారం-2 లేదా ఫారం-3 ద్వారా తిరువూరు మున్సిపల్ కార్యాలయంలో గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
