బ్రేకింగ్ న్యూస్
శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏
ఆంద్ర ప్రదేశ్

​నూజివీడు మున్సిపాలిటీపై జనసేన గురి: మున్సిపల్ చైర్మన్ పీఠమే లక్ష్యం

​నూజివీడు మున్సిపాలిటీపై జనసేన గురి: మున్సిపల్ చైర్మన్ పీఠమే లక్ష్యం
  • కూటమి ధర్మాన్ని పాటిస్తూనే సమష్టిగా పనిచేసి విజయం సాధించాలి: ప్రభుత్వ చీఫ్ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు
  • నూజివీడు చైర్మన్ పీఠం జనసేనకే దక్కేలా అధిష్టానానికి నివేదిస్తా: బొలిశెట్టి స్పష్టం
  • జనసేన బలంగా ఉంది.. అత్యధిక వార్డుల్లో గెలుపే లక్ష్యం: సమన్వయకర్త బర్మా ఫణిబాబు

నూజివీడు:

రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ నూజివీడుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏలూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు నూజివీడు పట్టణంలో పార్టీ ముఖ్య నేతలు, సమన్వయకర్తలు, జనసైనికులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా చీఫ్ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో పార్టీకి పట్టున్న బలమైన వార్డులను గుర్తించాలని సూచించారు. మిత్రపక్షాలతో కలిసి కూటమి ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే, సమష్టి కృషి ద్వారా అన్ని వార్డుల్లోనూ తిరుగులేని విజయం సాధించేలా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నూజివీడు మున్సిపల్ చైర్మన్ పదవి జనసేన పార్టీకి దక్కేలా పార్టీ అధిష్టానం వద్ద గట్టిగా ప్రతిపాదనలు ఉంచుతానని ఆయన స్పష్టం చేశారు.

Related News Desk పత్రికా ప్రకటన

​నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు మాట్లాడుతూ.. నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతో బలంగా ఉందని, ప్రజలు కూటమి పాలన పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అర్హులైన, ప్రజాబలం ఉన్న నాయకులను బరిలోకి దించి అత్యధిక వార్డుల్లో జనసేన అభ్యర్థుల విజయానికి అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు.

​ఈ సమావేశంలో ఏలూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేషన్ టీమ్ సభ్యులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.