రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరువూరుకు చెందిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పోలే శాంతి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవే పరమావధిగా నిరుపేదల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా మంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె కొనియాడారు.
రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని సమూలంగా ఆధునీకరిస్తూ, ప్రతి నిరుపేద కుటుంబానికి అత్యాధునిక వైద్య సేవలు అందేలా మంత్రి సత్యకుమార్ తీసుకుంటున్న చొరవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆయన నిజాయితీతో కూడిన నాయకత్వం, ప్రజా దృక్పథం ఎందరికో ఆదర్శమని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, సేవా ప్రస్థానంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Slug: ntr-district-bjp-vice-president-pole-santhi-birthday-wishes-minister-satya-kumar-yadav
