జన గళం జాతీయ డెస్క్: దేశంలోని పేద మహిళల ఆరోగ్య భద్రత, ఆర్థిక వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ (PMUY) పథకానికి సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఇప్పటికీ ఇళ్లలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ అనారోగ్యాలపాలవుతున్న మహిళలకు ఊరటనిచ్చేలా పీఎంయూఐ 2.0 పథకాన్ని మరికొన్నేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హులైన మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరుతోంది.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన నిరుపేద మహిళలకు పూర్తిగా ఉచితంగా ఎల్పీజీ (LPG) గ్యాస్ కనెక్షన్‌తో పాటు, గ్యాస్ స్టవ్ మరియు మొదటి సిలిండర్‌ను పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాకుండా, ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక ఊరట కల్పిస్తోంది. ఏడాదికి గరిష్టంగా నాలుగు సిలిండర్ల బుకింగ్‌పై ప్రతి సిలిండర్‌కు రూ. 300 చొప్పున ప్రత్యేక సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వంట చెరకు వాడకాన్ని తగ్గించి, మహిళలకు పొగ రహిత ఆరోగ్యకరమైన వంట వాతావరణాన్ని కల్పించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశం. అర్హత కలిగిన ఆసక్తిగల మహిళలు అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని అర్హులైన పేద కుటుంబాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Slug: central-government-pm-ujjwala-yojana-free-gas-connections-subsidy
