జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నంబూరి రామచంద్ర రాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం సత్యం, అహింస మార్గాల్లో పోరాడి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బాపూజీ త్యాగాలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నంబూరి రామచంద్ర రాజు గారు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ ఆశయాలు, సత్యం, అహింస, శాంతి మరియు దేశసేవ ప్రాధాన్యతను నేటి తరానికి వివరించారు. గాంధీజీ చూపిన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యమే దేశానికి పట్టుగొమ్మని నమ్మిన బాపూజీ ఆశయాల సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి కోనేటి చంటి, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు మద్దిపాటి ఉదయ్, తెలుగు యువత అధ్యక్షులు తెలగవరపు సాయి కృష్ణ, బీసీ సెల్ టౌన్ సెక్రెటరీ బిట్రాల సంతోష్, సీనియర్ నాయకులు దుర్గారావు, మాజీ కోఆప్షన్ సభ్యులు మరియు బిలాల్ మసీద్ చైర్మన్ టిడిపి యాకూబ్ షేక్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహనీయుని చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
Slug: jangareddygudem-tdp-office-gandhi-jayanti-namburi-ramachandra-raju
