బ్రేకింగ్ న్యూస్
నూజివీడులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు బాపూజీ: కాంగ్రెస్ నాయకులునూజివీడులో ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిరావులపాలెం మండలం ఈతకోటలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి.. ప్రత్యేక అధికారి వి.వి.ఎన్. వీరేష్ అధ్యక్షతన గ్రామసభ, అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన గ్రామస్తులుముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన మండల పంచాయతీ నాయకులతో సమీక్షా సమావేశం.. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ, పాల్గొన్న టీడీపీ పరిశీలకురాలు సుంకర పావని, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబువిజయవాడ రూరల్ గొల్లపూడి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి.. గాంధీజీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి: ఏఎంసీ చైర్మన్ నర్రా వాసు, కూటమి నేతలుఆగిరిపల్లి మండలం నూగొండపల్లిలో ఘనంగా సేవా సంకల్ప అభియాన్.. మెడికల్ క్యాంప్ నిర్వహించి వృద్ధులకు మందులు పంపిణీ చేసిన బీజేపీ శ్రేణులుఉయ్యూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.. పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం కాదు, వృద్ధులు, వితంతువులకు సామాజిక భరోసా: మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్రావులపాలెం మండలం లక్ష్మీపాలెంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవ్.. బాలల భవిష్యత్తుకు బలమైన పునాది అంగన్వాడీ కేంద్రాలు: వక్తలుమచిలీపట్నంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి.. మహనీయుల త్యాగాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలి: మున్సిపల్ కమిషనర్ వి. బాపిరాజుమచిలీపట్నంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి.. మహనీయుల త్యాగాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలి: మున్సిపల్ కమిషనర్ వి. బాపిరాజునూజివీడులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు బాపూజీ: కాంగ్రెస్ నాయకులునూజివీడులో ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిరావులపాలెం మండలం ఈతకోటలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి.. ప్రత్యేక అధికారి వి.వి.ఎన్. వీరేష్ అధ్యక్షతన గ్రామసభ, అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన గ్రామస్తులుముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన మండల పంచాయతీ నాయకులతో సమీక్షా సమావేశం.. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ, పాల్గొన్న టీడీపీ పరిశీలకురాలు సుంకర పావని, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబువిజయవాడ రూరల్ గొల్లపూడి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి.. గాంధీజీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి: ఏఎంసీ చైర్మన్ నర్రా వాసు, కూటమి నేతలుఆగిరిపల్లి మండలం నూగొండపల్లిలో ఘనంగా సేవా సంకల్ప అభియాన్.. మెడికల్ క్యాంప్ నిర్వహించి వృద్ధులకు మందులు పంపిణీ చేసిన బీజేపీ శ్రేణులుఉయ్యూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.. పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం కాదు, వృద్ధులు, వితంతువులకు సామాజిక భరోసా: మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్రావులపాలెం మండలం లక్ష్మీపాలెంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవ్.. బాలల భవిష్యత్తుకు బలమైన పునాది అంగన్వాడీ కేంద్రాలు: వక్తలుమచిలీపట్నంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి.. మహనీయుల త్యాగాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలి: మున్సిపల్ కమిషనర్ వి. బాపిరాజుమచిలీపట్నంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి.. మహనీయుల త్యాగాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలి: మున్సిపల్ కమిషనర్ వి. బాపిరాజు
ఆంధ్ర

మచిలీపట్నంలో ఘనంగా కృష్ణా జిల్లా స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్-2026 ప్రదానోత్సవం.. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలి: జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజి

machilipatnam-krishna-district-swachh-andhra-awards-2026-collector-dk-balaji
మచిలీపట్నంలో ఘనంగా కృష్ణా జిల్లా స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్-2026 ప్రదానోత్సవం.. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలి: జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజి

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘కృష్ణా జిల్లా స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్-2026’ (రెండో విడత) జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, జిల్లా స్థాయిలో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత రంగాలలో ప్రతిభ కనబరిచి ఎంపికైన వ్యక్తులు, సంస్థలు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజి గారు మాట్లాడుతూ.. స్వచ్ఛతను కేవలం ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంగా పరిమితం చేయకుండా, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఒక భాగమైన జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి మరియు పరిశుభ్రత మార్గంలో నడుస్తూ సామాజిక బాధ్యతను ప్రతి పౌరుడూ నిర్వర్తించాలని సూచించారు. మహాత్మా గాంధీ జీవితం ఒక పరిపూర్ణ మానవుడు సమాజం కోసం ఎలా బతకాలో తెలిపే నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. గాంధీజీ అత్యున్నత విద్యను అభ్యసించి బారిస్టర్‌గా మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని స్మరించుకున్నారు.

దక్షిణాఫ్రికాలో గాంధీజీకి రైలులో ఎదురైన జాతి వివక్ష అనుభవం ఆయన జీవితాన్నే మార్చివేసిందని కలెక్టర్ గుర్తుచేశారు. ఆ ఘటనను వ్యక్తిగత అవమానంగా కాకుండా ఒక సమాజానికి జరుగుతున్న అన్యాయంగా భావించి దానిపై పోరాడాలని నిర్ణయించుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనూ సంబరాల్లో పాల్గొనకుండా, దేశ విభజన కారణంగా అల్లర్లతో అశాంతిగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి శాంతిని నెలకొల్పేందుకు ఆయన శ్రమించారని తెలిపారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో పరిశుభ్రత, పారిశుద్ధ్య పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని సత్కరించడం ద్వారా మరింత మందిలో స్పూర్తి నింపడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

Related News Desk నూజివీడులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు బాపూజీ: కాంగ్రెస్ నాయకులు

ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి బోలెం నాగమణి, జెడ్పీ డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, పర్యాటక శాఖ జిల్లా అధికారి రామ లక్ష్మణరావు, వ్యవసాయ శాఖ జేడీ జ్యోతి రమణి, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ దయాకర్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు, ఇతర శాఖల అధికారులు మరియు అవార్డు గ్రహీతలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమ წარవిజయవంతం చేశారు.

Slug: machilipatnam-krishna-district-swachh-andhra-awards-2026-collector-dk-balaji