జన గళం రాష్ట్ర డెస్క్: ప్రజా సేవను జీవిత ధ్యేయంగా మలచుకుని, ప్రభుత్వ నాయకత్వంలో విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నిబద్ధత, అంకితభావం మరియు అత్యుత్తమ క్రమశిక్షణతో దేశ సేవలో నిరంతరం ముందుకు సాగుతున్న మోదీ గారి ప్రయాణం దేశ ప్రజలందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ దక్షత గల నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి, ప్రగతి పథంలో దూసుకుపోతోందని మంత్రి పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలకు చాటేలా ఆయన అద్భుతమైన కృషి చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రాధాన్యతను ఇనుమడింపజేస్తూ, ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ మోదీ గారు సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారని ప్రశంసించారు.
భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిత్యం ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, తన విశేష నాయకత్వ సామర్థ్యాన్ని మోదీ గారు నిరూపించిన విజేత అని మంత్రి అభివర్ణించారు. ప్రజా సేవలో ఆయన కనబరుస్తున్న అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మోదీ గారి దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశం మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని, దేశం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
Slug: minister-mandipalli-ramprasad-reddy-greets-pm-modi-25-year
