బ్రేకింగ్ న్యూస్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!వెస్ట్ ఇబ్రహీంపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. యువత ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్మైలవరం నియోజకవర్గంలో 146 మందికి రూ. 80.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం భరోసా: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్గుల్మార్గ్‌లో లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటన.. ఐబీబీఐ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ వల్లభనేని బాలశౌరినాటి చిల్లర.. నేటి జ్ఞాపకం: 1940 – 1990 భారతీయ నాణేల ప్రస్థానం!స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. మున్సిపల్ నుంచి జెడ్పీ వరకు కేటగిరీల వారీగా కోటాను వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడుతిరువూరు నుంచి బీసీలకు 40 శాతం సీట్లు కేటాయించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రజక, వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీతిరువూరులో కాంగ్రెస్ పార్టీ విలేకర్ల సమావేశం.. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలుకేబినెట్ భేటీకి పవన్ దూరం: పితృ తర్పణాల్లో నిమగ్నం!మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో దుర్గగుడి పాలకమండలి భేటీ: ఉత్సవాల ఏర్పాట్లపై చర్చ!రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!వెస్ట్ ఇబ్రహీంపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. యువత ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్మైలవరం నియోజకవర్గంలో 146 మందికి రూ. 80.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం భరోసా: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్గుల్మార్గ్‌లో లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటన.. ఐబీబీఐ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ వల్లభనేని బాలశౌరినాటి చిల్లర.. నేటి జ్ఞాపకం: 1940 – 1990 భారతీయ నాణేల ప్రస్థానం!స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. మున్సిపల్ నుంచి జెడ్పీ వరకు కేటగిరీల వారీగా కోటాను వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడుతిరువూరు నుంచి బీసీలకు 40 శాతం సీట్లు కేటాయించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రజక, వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీతిరువూరులో కాంగ్రెస్ పార్టీ విలేకర్ల సమావేశం.. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలుకేబినెట్ భేటీకి పవన్ దూరం: పితృ తర్పణాల్లో నిమగ్నం!మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో దుర్గగుడి పాలకమండలి భేటీ: ఉత్సవాల ఏర్పాట్లపై చర్చ!
ఆంధ్ర

అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్ స్వర్ణ పతక విజేత సంకు కృపారావు.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభినందన

ntr-district-venkatapuram-sanku-kruparao-commonwealth-gold-medal-vasantha-krishna-prasad
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్ స్వర్ణ పతక విజేత సంకు కృపారావు.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభినందన

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కెనడాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సంకు కృపారావును మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు ఘనంగా అభినందించారు. జి.కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను స్వర్ణ పతక విజేత కృపారావు మర్యాదపూర్వకంగా కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారుడు సాధించిన ఘనతను ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించి, భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

కామన్వెల్త్ వేదికపై త్రివర్ణ పతాకం ఎగరవేయడం ద్వారా కృపారావు రాష్ట్ర కీర్తిని ప్రపంచ స్థాయికి చాటారని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు పేర్కొన్నారు. కఠోర శ్రమ, నిరంతర సాధన, పట్టుదలతో ఈ విజయం సాధించడం అభినందనీయమని, ఈయన విజయం రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. క్రీడాకారులలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పి-4 కార్యక్రమం ద్వారా తగిన ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశకు లేఖ రాయగా, కృపారావుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిందని గుర్తుచేశారు.

Related News Desk రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!

భవిష్యత్తులోనూ కృపారావుకు మరింత ప్రోత్సాహం అందించేందుకు మరియు క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన సహకారం అందేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తన విజయాన్ని గుర్తించి అభినందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకు సంకు కృపారావు కృతజ్ఞతలు తెలుపుతూ, దేశానికి మరిన్ని పతకాలు తీసుకువచ్చేలా మరింత కష్టపడి సాధన చేస్తానని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

Slug: ntr-district-venkatapuram-sanku-kruparao-commonwealth-gold-medal-vasantha-krishna-prasad