బ్రేకింగ్ న్యూస్
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి: బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు, వీర మహిళలు!జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి: మచిలీపట్నం జనసేన కార్యాలయంలో పూలమాలలు వేసిన బండి రామకృష్ణ, వీరంకి గురుమూర్తి!పెడన నియోజకవర్గంలోని 4 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి: తహసీల్దార్‌కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం!‘జై జవాన్ – జై కిసాన్’ ప్రదాత లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు చిరస్మరణీయం: జయంతి వేళ పెడన నియోజకవర్గ నాయకులు లింగం నాగేశ్వరరావు ఘన నివాళి!పెడన రైతాంగానికి కొండంత ఆసరా: నాలుగు మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కృషిని కొనియాడిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కూనసాని చిన్న!ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: బాపూజీకి నివాళులర్పించిన జనసేన నేతలు అజయ్ వర్మ ఠాకూర్, మద్దిల రామకృష్ణ!మదనపల్లెలో ఆసక్తికర ఘటన.. చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అనంత్ అంబానీ, వీడియో వైరల్హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్.. ఏనుగు దంతాల అక్రమ విక్రయం గుట్టురట్టు, 17 కిలోల దంతాలు, ఐవరీ వస్తువులు స్వాధీనంనరసరావుపేటలో POSH చట్టంపై అవగాహన సదస్సు.. మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజకడప జిల్లా సుండుపల్లిలో శ్రీ విశ్వమేధ పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి గుర్తింపు రద్దు చేయాలి: ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి టి. ప్రశాంత్ డిమాండ్ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి: బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు, వీర మహిళలు!జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి: మచిలీపట్నం జనసేన కార్యాలయంలో పూలమాలలు వేసిన బండి రామకృష్ణ, వీరంకి గురుమూర్తి!పెడన నియోజకవర్గంలోని 4 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి: తహసీల్దార్‌కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం!‘జై జవాన్ – జై కిసాన్’ ప్రదాత లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు చిరస్మరణీయం: జయంతి వేళ పెడన నియోజకవర్గ నాయకులు లింగం నాగేశ్వరరావు ఘన నివాళి!పెడన రైతాంగానికి కొండంత ఆసరా: నాలుగు మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కృషిని కొనియాడిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కూనసాని చిన్న!ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: బాపూజీకి నివాళులర్పించిన జనసేన నేతలు అజయ్ వర్మ ఠాకూర్, మద్దిల రామకృష్ణ!మదనపల్లెలో ఆసక్తికర ఘటన.. చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అనంత్ అంబానీ, వీడియో వైరల్హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్.. ఏనుగు దంతాల అక్రమ విక్రయం గుట్టురట్టు, 17 కిలోల దంతాలు, ఐవరీ వస్తువులు స్వాధీనంనరసరావుపేటలో POSH చట్టంపై అవగాహన సదస్సు.. మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజకడప జిల్లా సుండుపల్లిలో శ్రీ విశ్వమేధ పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి గుర్తింపు రద్దు చేయాలి: ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి టి. ప్రశాంత్ డిమాండ్
ఆంధ్ర

పెడన నియోజకవర్గంలోని 4 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి: తహసీల్దార్‌కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం!

Slug: ap-rythu-sangham-representation-to-bantumilli-tahsildar-pedana-drought-mandals-loan-waiver
పెడన నియోజకవర్గంలోని 4 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి: తహసీల్దార్‌కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం!

​రచన: జన గళం బంటుమిల్లి / కృష్ణా డెస్క్: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలను తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కమిటీ (AIKS అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు బంటుమిల్లి మండల తహసీల్దార్‌కు లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారు.

​ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారుల ప్రకటనలతో రైతులు జూన్, జూలై నెలల్లో విత్తనాలు చల్లి నారుమళ్లు పోసుకుని సాగు ప్రారంభించారని తెలిపారు. అయితే, ఎల్ నినో (EL-NINO) ప్రభావం తీవ్రంగా ఉండటంతో తీవ్ర వర్షాభావం ఏర్పడి, కాలువలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. నీటి కొరత వల్ల వరి పంట ఎండిపోవడంతో రైతులు రెండు, మూడు సార్లు తిరిగి నాట్లు వేయాల్సి వచ్చిందని, ఫలితంగా అన్నదాతలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News Desk ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి: బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు, వీర మహిళలు!

​ప్రస్తుత విపత్కర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, గూడూరు మండలాలను తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించాలని వారు కోరారు. అంతేకాకుండా, సొంత మరియు కౌలు రైతులకు రూ.3 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బంటుమిల్లి మెయిన్ ఛానల్ పరిధిలో పంటలు కాపాడేందుకు వంతులవారీ విధానం ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు కె. నాగరాజు, జి. ఆంజనేయులు, జి. నారాయణరావు, జి. ప్రసాద్, గణేశ్ బాబు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.