జన గళం ఆధ్యాత్మిక డెస్క్: కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రసిద్ధ శ్రీ లంకమ్మతల్లి అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం (26-09-2026) ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ లంకమ్మతల్లి అమ్మవారి దివ్య ఆశీస్సులతో పౌర్ణమి వేళ ఆలయ ప్రాంగణంలో భక్తులకు విస్తృత స్థాయిలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి లంకమ్మతల్లి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ చైర్మన్ శ్రీ అన్నపరెడ్డి వెంకటస్వామి గారు కోరారు. అమ్మవారి దివ్యాశీస్సులు భక్తులందరిపై సదా ఉండాలని ఆకాంక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
