జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ యల్లటూరు శ్రీనివాసరాజు ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రకృతి మనకు ఇచ్చిన వరం.. దాన్ని కాపాడటం మన బాధ్యత.. పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేయాలి” అన్న డిప్యూటీ సీఎం, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
చెట్లు నాటడం, నీటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మరియు పర్యావరణాన్ని పెంపొందించడం ద్వారానే మానవాళికి ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ప్రతి పౌరుడూ పర్యావరణ పరిరక్షణను ఒక ఉద్యమంలా చేపట్టి భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, నేలను అందించేందుకు నడుం బిగించాలని ఆయన కోరారు.
