రచన: జన గళం గుంటూరు డెస్క్: గుంటూరు జిల్లాలో నూతనంగా ఏర్పాటైన మెగా యూత్ ఫోర్స్ జిల్లా కమిటీ బాధ్యతలు స్వీకరించిన ప్రతినిధులు శుక్రవారం జిల్లా నాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మెగా యూత్ ఫోర్స్ గౌరవ అధ్యక్షులు, జిల్లా కన్వీనర్ చింతా శివ నాయకత్వంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా కో-కన్వీనర్‌గా నియమితులైన తిరుమలశెట్టి నరేష్ (కిట్టు), ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టిన జనసేన పార్టీ వీర మహిళ రామిశెట్టి ధరణిలు జిల్లా కన్వీనర్ చింతా శివ, జిల్లా జాయింట్ కన్వీనర్ పావులూరి కోటేశ్వరావులను ప్రత్యక్షంగా కలిశారు. తమపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు నాయకులకు శాలువాలతో చిరు సత్కారం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామిశెట్టి ధరణి మాట్లాడుతూ.. తన ప్రత్యక్ష దైవమైన మెగా ఫ్యామిలీ పేరు మీద సమాజానికి సేవా కార్యక్రమాలు చేసే అదృష్టం ఈ నూతన కమిటీ ద్వారా లభించడం ఎంతో గర్వకారణమని, మెగా కుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. చింతా శివ గారి మార్గదర్శకత్వంలో, జిల్లా కమిటీ సమష్టి కృషితో మెగా యూత్ ఫోర్స్ ప్రతిష్టను మరింత ముందుకు తీసుకెళ్లేలా విస్తృత సేవా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. మెగాభిమానులు, యువతను ఏకం చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంటామని నూతన ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.
