జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గుంటూరు నగరంలోని ప్రముఖ ఆదిత్య మెడికేర్ హాస్పిటల్ వేదికగా శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ ముఖ్య నాయకులు శ్రీ చందు జనార్ధన్ గారు పాల్గొని, ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ స్రవంత్ గారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వీరిరువురి మధ్య స్థానిక సామాజిక పరిస్థితులు, ప్రజారోగ్యం, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. సమాజ సేవలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ఆదిత్య మెడికేర్ అందిస్తున్న సేవలను చందు జనార్ధన్ ప్రశంసించారు. అనంతరం డాక్టర్ స్రవంత్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ ఆత్మీయ కలయికలో పలువురు స్థానిక ప్రముఖులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
