జన గళం మచిలీపట్నం బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ సమాయత్తమవుతున్న క్రమంలో కీలక నియామకాలు వేగవంతమయ్యాయి. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా జనసేన సీనియర్ నాయకుడు శ్రీ కొట్టె అంక వెంకటరావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అక్టోబర్ 11న ఈ అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆయనతో పాటు డాక్టర్ బండిరెడ్డి రామ కృష్ణ, సాయన శివ నారాయణ (శివయ్య)లను అసెంబ్లీ సమన్వయకర్తలుగా ప్రకటించగా, 32 మందితో నిర్వాహక్ దళ్, ఐదుగురితో సపోర్ట్ టీంలను పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. తనపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు కొట్టె వెంకటరావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బందరు పోర్టు నగరం పరిధిలోని ప్రతి వార్డు, గ్రామంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, స్థానిక సమరంలో కూటమి అభ్యర్థుల భారీ విజయానికి అంకితభావంతో కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
మచిలీపట్నం అసెంబ్లీ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా కొట్టె వెంకటరావు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!
Slug: kotte-venkatarao-appointed-machilipatnam-assembly-local-body-elections-coordinator-thanks-pawan-kalyan
