జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం మచిలీపట్నం పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మచిలీపట్నం జనసేనికల తరుపున మదివాడ రాము సభ్యుడిగా నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి మరియు స్థానిక ఎన్నికల వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆయనకు ఈ కీలక బాధ్యతను అప్పగించారు.
పార్టీ అధినాయకత్వం నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను మదివాడ రాము సమర్థవంతంగా నిర్వహిస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియామకం పట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంగవీటి రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు రాయగిరి శ్రీరామ్ మోహన్ రావు (RSR) ప్రత్యేకంగా అభినందించారు. మదివాడ రాముకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన సేవలు పార్టీ విజయానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నూతన కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మిత్రమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మదివాడ రాముకు అభినందనలు తెలియజేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి ఈ కమిటీ సేవలు కీలకం కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
