జన గళం మచిలీపట్నం బ్యూరో: కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తుది ఫలితాలను జిల్లా ఎన్నికల అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 26 జడ్పీటీసీ స్థానాల్లోనూ, 343 ఎంపీటీసీ స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 26 జడ్పీటీసీలలో కూటమి ఏకంగా 24 స్థానాలను (టీడీపీ 19, జనసేన 4, బీజేపీ 1) గెలుచుకుని జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకుంది. 343 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 270 స్థానాల్లో (టీడీపీ 202, జనసేన 64, బీజేపీ 4) జయకేతనం ఎగురవేసింది.
కృష్ణా జిల్లా స్థానిక సంస్థల సమగ్ర ఫలితాలు:
• జడ్పీటీసీ స్థానాల సంఖ్య (మొత్తం 26):
- తెలుగుదేశం పార్టీ (TDP): 19 స్థానాలు
- జనసేన పార్టీ (JSP): 4 స్థానాలు
- భారతీయ జనతా పార్టీ (BJP): 1 స్థానం
- ఎన్డీఏ కూటమి మొత్తం: 24 స్థానాలు
- వైఎస్సార్‌సీపీ (YSRCP): 1 స్థానం (గన్నవరం)
- ఇండిపెండెంట్ (IND): 1 స్థానం (మొవ్వ)
• ఎంపీటీసీ స్థానాల సంఖ్య (మొత్తం 343):
- తెలుగుదేశం పార్టీ (TDP): 202 స్థానాలు
- జనసేన పార్టీ (JSP): 64 స్థానాలు
- భారతీయ జనతా పార్టీ (BJP): 4 స్థానాలు
- ఎన్డీఏ కూటమి మొత్తం: 270 స్థానాలు
- వైఎస్సార్‌సీపీ (YSRCP): 63 స్థానాలు
- ఇండిపెండెంట్లు: 8 స్థానాలు
- సీపీఎం: 2 స్థానాలు
- 26 మండలాల జడ్పీటీసీ విజేతలు, పార్టీలు మరియు మెజార్టీల వివరాలు:
- అవనిగడ్డ: జయలక్ష్మి విక్కుర్తి (టీడీపీ) – 10,997 ఓట్ల మెజార్టీ
- బంటుమిల్లి: రేవు గోపాలకృష్ణ (టీడీపీ) – 6,943 ఓట్ల మెజార్టీ
- బాపులపాడు: చింతల వెంకట శివ అప్పారావు (టీడీపీ) – 5,547 ఓట్ల మెజార్టీ
- చల్లపల్లి: ఉదయ్ కుమార్ రావెళ్ల (టీడీపీ) – 4,980 ఓట్ల మెజార్టీ
- గన్నవరం: అనగాని రవి (వైఎస్సార్‌సీపీ) – 63 ఓట్ల మెజార్టీ
- ఘంటసాల: పవిత్ర దోవారి (జనసేన) – 5,451 ఓట్ల మెజార్టీ
- గుడివాడ: అంగడాల భారతి (టీడీపీ) – 2,173 ఓట్ల మెజార్టీ
- గుడ్లవల్లేరు: బలరామకృష్ణ వర్రే (జనసేన) – 7,650 ఓట్ల మెజార్టీ
- గూడూరు: చోడగం నాంచారమ్మ (టీడీపీ) – 7,330 ఓట్ల మెజార్టీ
- కంకిపాడు: దండమూడి పూజిత (టీడీపీ) – 8,420 ఓట్ల మెజార్టీ
- కోడూరు: బొలిశెట్టి అరుణశ్రీ (టీడీపీ) – 5,053 ఓట్ల మెజార్టీ
- కృత్తివెన్ను: గరికపాటి శ్రీలత (జనసేన) – 5,309 ఓట్ల మెజార్టీ
- మచిలీపట్నం (నార్త్): లంకె ఉషారాణి (టీడీపీ) – 2,831 ఓట్ల మెజార్టీ
- మచిలీపట్నం (సౌత్): కాగిత వెంకటేశ్వరరావు (టీడీపీ) – 4,657 ఓట్ల మెజార్టీ
- మోపిదేవి: మురాల సీతమ్మ (జనసేన) – 5,588 ఓట్ల మెజార్టీ
- మొవ్వ: నన్నపనేని వీరేంద్ర (ఇండిపెండెంట్) – 6,668 ఓట్ల మెజార్టీ
- నాగాయలంక: భోగాది రమాదేవి (బీజేపీ) – 3,579 ఓట్ల మెజార్టీ
- నందివాడ: ప్రదీప్ కుమార్ దుడ్ల (టీడీపీ) – 2,431 ఓట్ల మెజార్టీ
- పామర్రు: శీలం వెంకటేశ్వరమ్మ (టీడీపీ) – 8,469 ఓట్ల మెజార్టీ
- పమిడిముక్కల: తాతినేని ప్రవల్లి (టీడీపీ) – 9,106 ఓట్ల మెజార్టీ
- పెడన: కాగిత లక్ష్మి (టీడీపీ) – 3,713 ఓట్ల మెజార్టీ
- పెదపారుపూడి: కాటమరాజు పాగోలు (టీడీపీ) – 924 ఓట్ల మెజార్టీ
- పెనమలూరు: కాండ్రు సరిత (టీడీపీ) – 8,160 ఓట్ల మెజార్టీ
- తోట్లవల్లూరు: గోగులమూడి సుమ (టీడీపీ) – 2,499 ఓట్ల మెజార్టీ
- ఉంగుటూరు: తుమ్మల మోహన రూప (టీడీపీ) – 679 ఓట్ల మెజార్టీ
- వుయ్యూరు: కంభం రమేష్ బాబు (టీడీపీ) – 5,314 ఓట్ల మెజార్టీ
- మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాల పార్టీ ఫలితాలు:• అవనిగడ్డ (మొత్తం 12): జనసేన 6, టీడీపీ 4, వైఎస్సార్‌సీపీ 2• బంటుమిల్లి (మొత్తం 13): టీడీపీ 8, వైఎస్సార్‌సీపీ 3, జనసేన 2• బాపులపాడు (మొత్తం 24): టీడీపీ 11, జనసేన 6, వైఎస్సార్‌సీపీ 6, బీజేపీ 1• చల్లపల్లి (మొత్తం 15): జనసేన 5, టీడీపీ 5, వైఎస్సార్‌సీపీ 4, ఇండిపెండెంట్ 1• గన్నవరం (మొత్తం 25): టీడీపీ 13, వైఎస్సార్‌సీపీ 7, జనసేన 2, ఇండిపెండెంట్ 2, బీజేపీ 1• ఘంటసాల (మొత్తం 11): టీడీపీ 8, జనసేన 3 (వైసీపీ జీరో)• గుడివాడ (మొత్తం 6): టీడీపీ 4, జనసేన 1, వైఎస్సార్‌సీపీ 1• గుడ్లవల్లేరు (మొత్తం 15): టీడీపీ 11, జనసేన 3, వైఎస్సార్‌సీపీ 1• గూడూరు (మొత్తం 14): టీడీపీ 8, జనసేన 5, సీపీఎం 1 (వైసీపీ జీరో)• కంకిపాడు (మొత్తం 20): టీడీపీ 14, వైఎస్సార్‌సీపీ 3, జనసేన 2, బీజేపీ 1• కోడూరు (మొత్తం 13): జనసేన 7, టీడీపీ 3, వైఎస్సార్‌సీపీ 3• కృత్తివెన్ను (మొత్తం 14): టీడీపీ 11, జనసేన 2, వైఎస్సార్‌సీపీ 1• మచిలీపట్నం నార్త్ (మొత్తం 9): టీడీపీ 5, జనసేన 3, ఇండిపెండెంట్ 1 (వైసీపీ జీరో)• మచిలీపట్నం సౌత్ (మొత్తం 11): టీడీపీ 7, వైఎస్సార్‌సీపీ 2, జనసేన 1, ఇండిపెండెంట్ 1• మోపిదేవి (మొత్తం 10): టీడీపీ 5, జనసేన 3, వైఎస్సార్‌సీపీ 2• మొవ్వ (మొత్తం 15): టీడీపీ 10, జనసేన 2, వైఎస్సార్‌సీపీ 1, ఇండిపెండెంట్ 1, బీజేపీ 1• నాగాయలంక (మొత్తం 7): టీడీపీ 5, జనసేన 1, వైఎస్సార్‌సీపీ 1• నందివాడ (మొత్తం 10): టీడీపీ 8, వైఎస్సార్‌సీపీ 2• పామర్రు (మొత్తం 16): టీడీపీ 13, జనసేన 1, వైఎస్సార్‌సీపీ 1, ఇండిపెండెంట్ 1• పమిడిముక్కల (మొత్తం 15): టీడీపీ 8, వైఎస్సార్‌సీపీ 4, జనసేన 2, ఇండిపెండెంట్ 1• పెడన (మొత్తం 10): టీడీపీ 6, జనసేన 3, వైఎస్సార్‌సీపీ 1• పెదపారుపూడి (మొత్తం 9): టీడీపీ 6, వైఎస్సార్‌సీపీ 3• పెనమలూరు (మొత్తం 12): టీడీపీ 6, జనసేన 3, వైఎస్సార్‌సీపీ 3• తోట్లవల్లూరు (మొత్తం 11): టీడీపీ 7, వైఎస్సార్‌సీపీ 3, జనసేన 1• ఉంగుటూరు (మొత్తం 16): టీడీపీ 8, వైఎస్సార్‌సీపీ 7, సీపీఎం 1• వుయ్యూరు (మొత్తం 10): టీడీపీ 8, వైఎస్సార్‌సీపీ 2
