జన గళం పెడన బ్యూరో: స్థానిక సంస్థల సమరంలో కృష్ణా జిల్లా పెడన శాసనసభ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి (టీడీపీ – జనసేన – బీజేపీ) అఖండ విజయాన్ని నమోదు చేసింది. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లోని నాలుగు జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలతో క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా, ఎంపీటీసీ స్థానాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారి సారథ్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు సమన్వయంతో కదం తొక్కి పల్లె సీమల్లో తిరుగులేని విజయకేతనం ఎగురవేశాయి.
జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు (4/4 కూటమి కైవసం):
• కృత్తివెన్ను జడ్పీటీసీ: ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని శ్రీమతి గరికపాటి శ్రీలత గారు 5,275 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
• బంటుమిల్లి జడ్పీటీసీ: తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ రేవు గోపాలకృష్ణ గారు 9,705 ఓట్ల రికార్డు స్థాయి భారీ మెజార్టీతో అఖండ విజయం సాధించారు.
• గూడూరు జడ్పీటీసీ: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని శ్రీమతి చోడగం నాంచారమ్మ గారు 7,168 ఓట్ల భారీ ఆధిక్యంతో ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు.
• పెడన మండల జడ్పీటీసీ: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని శ్రీమతి కాగిత లక్ష్మి గారు 378 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
