జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తన జన్మదినం సందర్భంగా ఆత్మీయంగా స్పందించి, శుభాకాంక్షలు వెల్లువలా కురిపించిన ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ పెడన నియోజకవర్గ నాయకులు శ్రీ లింగం నాగేశ్వరరావు గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పుట్టినరోజు వేళ స్వయంగా కలిసి, అలాగే సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు కుటుంబ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణులు తనపై చూపించిన అపారమైన ప్రేమ, విశ్వాసం ప్రజాసేవలో తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. ఇదే ప్రేమాభిమానాలు భవిష్యత్తులోనూ ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షిస్తూ, పెడన నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి, పార్టీ ఆశయాల సాధనకు నిరంతరం అంకితభావంతో పనిచేస్తానని లింగం నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
