జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: మెగా యూత్ ఫోర్స్ గుంటూరు జిల్లా కమిటీలో కీలక నియామకం చేపట్టింది. మంగళగిరికి చెందిన యువ నాయకుడు శ్రీ నీలాద్రి వంశీ గారిని మెగా యూత్ ఫోర్స్ గుంటూరు జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యుడిగా (ఎగ్జిక్యూటివ్ మెంబర్) నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో యువతను సమన్వయం చేయడంలో ఆయన చూపుతున్న చొరవను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు.
తనపై నమ్మకంతో గుంటూరు జిల్లా కమిటీలో అవకాశం కల్పించిన అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామినాయుడు గారికి, ప్రముఖ నాయకులు శ్రీ ఏడిద బాబి గారికి, శ్రీ చింత శివ గారికి, అలాగే శ్రీ నవ్వబోతు తేజ గారికి నీలాద్రి వంశీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సమాజ హితం కోసం, మెగా ఆశయాల సాధనలో అంకితభావంతో పనిచేస్తూ సంస్థ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నీలాద్రి వంశీ నియామకం పట్ల మంగళగిరి ప్రాంత యువత, అభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
