జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్, మాజీ శాసనసభ్యులు సర్దార్ సామినేని ఉదయభాను గారిని నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముత్యాల కామేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని ఉదయభాను స్వగృహంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పార్టీ పరిస్థితులు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత మరియు పార్టీ పదవుల నియామకాలపై ఇరువురు సమగ్రంగా చర్చించారు. జనసేన పార్టీని నూజివీడులో మరింత బలోపేతం చేయడం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముత్యాల కామేష్ పార్టీ జిల్లా అధ్యక్షులకు వివరించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో కృషి చేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన జెండాను రెపరెపలాడించాలని ఈ సందర్భంగా సామినేని ఉదయభాను దిశానిర్దేశం చేశారు.
