రచన: జన గళం ఇంద్రకీలాద్రి/విజయవాడ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత వైభవంగా జరిగే విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు – 2026 షెడ్యూల్‌ను ఆలయ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ పది రోజుల్లో జగన్మాత పది విశేష అలంకారాలలో భక్తులకు దివ్యదర్శనం ఇవ్వనున్నారు.
ఉత్సవాల సందర్భంగా అమ్మవారి అలంకారాలు, దర్శన సమయాలు ఇలా ఉన్నాయి:
- అలంకారాల వివరాలు:
- 11-10-2026: శ్రీ బాలా త్రిపురసుందరి దేవి
- 12-10-2026: శ్రీ గాయత్రీ దేవి
- 13-10-2026: శ్రీ అన్నపూర్ణాదేవి
- 14-10-2026: శ్రీ మహిషాసురమర్ధిని దేవి
- 15-10-2026: శ్రీ లలితా త్రిపురసుందరి దేవి
- 16-10-2026: శ్రీ సరస్వతి దేవి (మూలా నక్షత్రం)
- 17-10-2026: శ్రీ మహిషాసురమర్ధిని దేవి
- 18-10-2026: శ్రీ దుర్గాదేవి
- 19-10-2026: శ్రీ మహిషాసురమర్ధిని దేవి
- 20-10-2026: శ్రీ రాజరాజేశ్వరి దేవి (విజయదశమి)
మొదటి రోజైన అక్టోబర్ 11న ఉదయం 8:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. అక్టోబర్ 12 నుండి 20 వరకు ప్రతిరోజూ తెల్లవారుజామున 4:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నిరంతరాయంగా దర్శనాలకు అనుమతి ఉంటుంది. పరోక్ష సేవల కింద ఒక రోజు పూజకు ₹1,500, పది రోజుల పాటు పూజకు ₹11,116 రుసుముగా నిర్ణయించారు. భక్తులు ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ (+91 95523 00009) లేదా aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 9099 అందుబాటులో ఉంటుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉచిత ప్రసాదం, నిరన్నదానం, తాగునీరు, ఉచిత వైద్య సేవలు, లగేజ్ మరియు పాదరక్షల కౌంటర్లను విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు దేవస్థానం పేర్కొంది.
