రచన: జన గళం విజయవాడ బ్యూరో: ప్రముఖ కాపు ఉద్యమ నేత, జాతీయ కాపునాడు అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి దశదిన కర్మ కార్యక్రమం విజయవాడలో అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో జరిగింది. ఈ సంస్మరణ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త ముఖ్య అతిథిగా హాజరై గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి చేతులు జోడించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో బడుగు, బలహీన, కాపు వర్గాల అభ్యున్నతి కోసం, వారి సామాజిక హక్కుల సాధన కోసం గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు జీవితాంతం చేసిన సేవలను కొనియాడారు. ఆయన నిబద్ధతతో కూడిన పోరాటం సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండే ఆయన అకాల మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
