జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ ఇందిరా నగర్ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు.
ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సమాజంలో సేవా భావాన్ని చాటేందుకు యువత ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక 20వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ జయకుమార్, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు, కాలనీ పెద్దలు మరియు జనసేన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
