జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ గ్రీన్ (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబును మంగళగిరిలోని అరణ్య భవన్‌లో జనసేన పార్టీ నాయకులు, చిరంజీవి యువత సీనియర్ అభిమాని ఆళ్ల హరి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, మంచి మనసున్న మెగా బ్రదర్ నాగబాబును కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ ఆత్మీయ భేటీలో రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై చర్చించారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో బాధ్యతలు చేపట్టిన నాగబాబు నాయకత్వంలో రాష్ట్రంలో హరిత విప్లవం మరింత ముందుకు సాగాలని ఆళ్ల హరి ఆకాంక్షించారు. పర్యావరణ హిత కార్యక్రమాల్లో యువతను, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు.
