బ్రేకింగ్ న్యూస్
ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల: ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయంపామర్రులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ: లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపామర్రులో ఘనంగా వినాయక చవితి వేడుకలు: ప్రత్యేక పూజలు మరియు నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాగుడివాడ – హనుమాన్ జంక్షన్ మార్గంలో నిలిచిన రాకపోకలు: ఉప్పొంగుతున్న బుడమేరు వరదకైకలూరులో నూతన 220KV విద్యుత్ కేంద్రం ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు: పనులను పరిశీలించిన కామినేనిమదనపల్లిలో ఉపాధ్యాయ సంఘాల తీరుపై విమర్శలు: డీఈఓ అవినీతి ఆరోపణలపై జేఏసీ నిరసనమచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో పర్యాటకుల సందడి: మహాగణపతి నిమజ్జనోత్సవంతో ఆధ్యాత్మిక శోభఉండ్రాజవరంలో వంగవీటి రంగా విగ్రహ తొలగింపు కలకలం: రణరంగంగా మారిన నిడదవోలు పరిసరాలు.. భారీగా మోహరించిన పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత!ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అహ్మదాబాద్‌లో రోడ్‌షో: టోరెంట్ గ్రూప్ అధినేతలతో కీలక భేటీఅవనిగడ్డలో జనసేన నేత గుడివాక శేషుబాబు సతీమణిని పరామర్శించిన పార్టీ ప్రముఖులుఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల: ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయంపామర్రులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ: లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపామర్రులో ఘనంగా వినాయక చవితి వేడుకలు: ప్రత్యేక పూజలు మరియు నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాగుడివాడ – హనుమాన్ జంక్షన్ మార్గంలో నిలిచిన రాకపోకలు: ఉప్పొంగుతున్న బుడమేరు వరదకైకలూరులో నూతన 220KV విద్యుత్ కేంద్రం ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు: పనులను పరిశీలించిన కామినేనిమదనపల్లిలో ఉపాధ్యాయ సంఘాల తీరుపై విమర్శలు: డీఈఓ అవినీతి ఆరోపణలపై జేఏసీ నిరసనమచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో పర్యాటకుల సందడి: మహాగణపతి నిమజ్జనోత్సవంతో ఆధ్యాత్మిక శోభఉండ్రాజవరంలో వంగవీటి రంగా విగ్రహ తొలగింపు కలకలం: రణరంగంగా మారిన నిడదవోలు పరిసరాలు.. భారీగా మోహరించిన పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత!ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అహ్మదాబాద్‌లో రోడ్‌షో: టోరెంట్ గ్రూప్ అధినేతలతో కీలక భేటీఅవనిగడ్డలో జనసేన నేత గుడివాక శేషుబాబు సతీమణిని పరామర్శించిన పార్టీ ప్రముఖులు
ఆంధ్ర

ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!

ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!

తుఫాను ప్రభావంతో గాలులు, వర్షాలు.. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి

జన గళం | ప్రత్యేక కథనం

సెప్టెంబర్ 24న తుఫాను ప్రభావంతో గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సూచించింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు, విద్యుత్ పరికరాలను తాకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Related News Desk పామర్రులో ఘనంగా వినాయక చవితి వేడుకలు: ప్రత్యేక పూజలు మరియు నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
  1. తడిసిన విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు.
  2. తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు, స్విచ్ బోర్డులను తాకకూడదు.
  3. విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్లు లేదా కొమ్మలను స్వయంగా తొలగించేందుకు ప్రయత్నించకూడదు.
  4. విద్యుత్ తీగలకు చెట్టు కొమ్మలు తగిలినట్లయితే సంబంధిత లైన్‌మన్ లేదా విద్యుత్ కార్యాలయానికి వెంటనే సమాచారం ఇవ్వాలి.
  5. పార్కులు, స్టేడియంలలోని విద్యుత్ స్తంభాలు, ఇతర విద్యుత్ పరికరాలను తాకకూడదు.
  6. ఇంట్లోని స్విచ్ బోర్డులను తడి చేతులతో తాకకూడదు.
  7. బయట ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, పరికరాలు నీటికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  8. విద్యుత్‌కు సంబంధించిన ఏ పరికరాన్నీ తడి చేతులతో తాకకూడదు.
  9. చిన్న పిల్లలను విద్యుత్ పరికరాలు, వైర్లు, స్విచ్ బోర్డులకు దూరంగా ఉంచాలి.
  10. ఇంటి వద్ద విద్యుత్ తీగలు లేదా ఇనుప తీగలపై తడి బట్టలు ఆరబెట్టకూడదు.
  11. గాలి, వర్షం కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. వాటికి దూరంగా ఉండాలి.
  12. వాటర్ హీటర్ ఉపయోగించే ముందు విద్యుత్ సరఫరా నిలిపివేసి, ప్లగ్ తొలగించిన తర్వాతే సంబంధిత పరికరాన్ని తాకాలి.
  13. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో డిష్ కనెక్షన్‌ను తొలగించడం మంచిది.
  14. వర్షం సమయంలో టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్ వంటి విద్యుత్ పరికరాలను అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసి విద్యుత్ సరఫరా నుంచి వేరు చేయాలి.
  15. విద్యుత్ లైన్ల సమీపంలో సెల్‌ఫోన్ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు, పిడుగుల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
  16. ఇంటికి వచ్చే సర్వీస్ వైర్ దెబ్బతిన్నట్లయితే సంబంధిత విద్యుత్ సిబ్బంది—జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం, లైన్‌మన్, ఎల్‌ఐ, సబ్‌స్టేషన్ లేదా ఏఈకి సమాచారం ఇవ్వాలి. అవసరమైతే 1912కు ఫిర్యాదు చేయాలి.

ప్రజలకు విజ్ఞప్తి

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ ప్రమాదాలను తేలికగా తీసుకోకండి. తెగిన వైర్లు, తడిసిన విద్యుత్ పరికరాలు, దెబ్బతిన్న స్తంభాలకు దూరంగా ఉండండి.

అప్రమత్తతే ప్రాణరక్షణ.
విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.