జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో జిల్లా ఆర్యవైశ్య వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ కొత్తా పురుషోత్తం గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారు ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. కొత్తా పురుషోత్తం గారితో స్వయంగా కేక్ కట్ చేయించిన అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పురుషోత్తం గారు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, వ్యాపార, సేవా రంగాల్లో సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకరరావు, మాజీ కౌన్సిలర్ డాక్టర్ చారుగుండ్ల కొండా, ప్రముఖ పుణ్యక్షేత్రం చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గెల్లా పూర్ణచంద్రరావులతో పాటు పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో ఆర్యవైశ్య సంఘం అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. పురుషోత్తం గారికి వివిధ వర్గాల ప్రముఖులు, మిత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు వర్షం కురిపించారు.
