జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విగ్రహాలు అంటే కేవలం రాళ్లు, రప్పలు, ఇనుము, సిమెంట్ కలగలిపిన రూపాలు మాత్రమే కావు.. అవి లక్షలాది మంది ప్రజల భావోద్వేగాలకు, ఆత్మాభిమానానికి నిలువెత్తు ప్రతీకలు! ప్రజల గుండెల్లో కొలువైన మహనీయుల విగ్రహాల జోలికి వెళ్లడం అంటే నేరుగా వారి మనోభావాలను గాయపరచడమేనని ప్రజా సంఘాలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఊరూరా ప్రతిష్ఠిస్తున్నప్పుడు లేని నిబంధనలు, అభ్యంతరాలు.. పేదల పక్షపాతి, దివంగత నేత శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహాల ఏర్పాటు విషయంలోనే ఎందుకు తెరపైకి వస్తున్నాయని ప్రజలు నిలదీస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరి వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రంగా విగ్రహాల వద్దే ఆంక్షలు, అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టించడం ప్రజలను కించపరచడమేనని మండిపడుతున్నారు. పాలకులు, అధికారులు ఇప్పటికైనా ఈ పక్షపాత వైఖరిని వీడి ప్రజల మనోభావాలను గౌరవిస్తే మంచిదని, “మమ్మల్ని ఎవరు అడుగుతారులే” అనే అహంకారంతో విగ్రహాల జోలికి వెళ్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
