బ్రేకింగ్ న్యూస్
పెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలుగాంధీనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను!పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజుదసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం… భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్చనమచిలీపట్నంలో ఘనంగా దర్గా అభివృద్ధి పనుల శంకుస్థాపన… ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి నేతలుఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ… హాజరై నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడురేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుతిరువూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు… వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నివాళులర్పించనున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గొడ్డలివేటు: కోర్టుల్లో అడ్డగోలు వాదనలతో బీసీలకు తీరని అన్యాయం… మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ధ్వజంమచిలీపట్నంలో అభివృద్ధి పరుగులు… సీతారాంపురంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్రపెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలుగాంధీనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను!పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజుదసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం… భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్చనమచిలీపట్నంలో ఘనంగా దర్గా అభివృద్ధి పనుల శంకుస్థాపన… ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి నేతలుఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ… హాజరై నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడురేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుతిరువూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు… వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నివాళులర్పించనున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గొడ్డలివేటు: కోర్టుల్లో అడ్డగోలు వాదనలతో బీసీలకు తీరని అన్యాయం… మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ధ్వజంమచిలీపట్నంలో అభివృద్ధి పరుగులు… సీతారాంపురంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్ర

విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరిట భారీ మోసం: విశ్రాంత ఇంజనీర్ నుంచి రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.7 కోట్లను ఫ్రీజ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు!

​Slug: vijayawada-digital-arrest-scam-retired-engineer-duped-10-crores-cyber-police-freeze-7-crores
విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరిట భారీ మోసం: విశ్రాంత ఇంజనీర్ నుంచి రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.7 కోట్లను ఫ్రీజ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు!

​జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట పెను సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. చట్టాన్ని రక్షించే పోలీసులమంటూ నాటకమాడిన సైబర్ కేటుగాళ్లు.. ఒక విశ్రాంత ఇంజనీర్‌ను తీవ్ర భయాందోళనలకు గురిచేసి ఏకంగా రూ.10 కోట్ల భారీ మొత్తాన్ని దోచుకున్నారు.

​పోలీస్ అధికారుల పేరుతో బాధితుడికి ఫోన్ చేసిన దుండగులు, ఏదో తీవ్రమైన నేరంలో చిక్కుకున్నారని బెదిరిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో గంటల తరబడి ఆన్‌లైన్ నిఘాలో ఉంచారు. కేసుల నుంచి తప్పిస్తామని నమ్మబలికి ఆయనతో వివిధ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించారు. బాధితుడు కృష్ణలంకలోని కెనరా బ్యాంక్ శాఖలోని తన ఖాతా నుంచి నిందితులు సూచించిన రెండు బ్యాంకు ఖాతాల్లోకి దశలవారీగా రూ.10 కోట్లను డిపాజిట్ చేశారు. అయినప్పటికీ సైబర్ కేటుగాళ్లు ఇంకా అదనపు నగదు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు చివరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా వేగంగా దర్యాప్తు చేపట్టి, నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.7 కోట్లను సకాలంలో ఫ్రీజ్ చేయడంలో విజయం సాధించారు. కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశామని, డిజిటల్ అరెస్ట్‌ల పేరిట వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మి ఎవరూ డబ్బులు పంపవద్దని సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

Related News Desk పెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలు