బ్రేకింగ్ న్యూస్
మృత్యుకుహరంగా మారిన 216 జాతీయ రహదారి: నిత్యం నెత్తురోడుతున్న కోస్తా హైవే.. మార్జిన్ల ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంతో గాల్లో కలుస్తున్న నిండు ప్రాణాలు!ఎల్-నినో ముసుగులో నిత్యావసరాల దోపిడీ: ధరలు మండిపోతున్నా చర్యలేవీ?.. మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగాలని ప్రజల డిమాండ్!జక్కంపూడి రాజాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ: అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల సంబరాలు🚨 నేడు భీమిలిలో వైసీపీ కీలక సమావేశంప్రొద్దుటూరులో నేడు జల్ జీవన్ మిషన్ 2.0విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలు 2026: అక్టోబర్ 11 నుంచి 20 వరకు వైభవంగా నవరాత్రులు.. అమ్మవారి 10 విశేష అలంకారాలు, దర్శన సమయాల షెడ్యూల్ విడుదల!కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి దశదిన కర్మలో జనసేన నేతల నివాళి: చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన జనసేన రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త!ఇంద్రకీలాద్రిపై దసరా ప్రత్యక్ష విశేష పూజా టికెట్ల విడుదల: అక్టోబర్ 5 సాయంత్రం నుంచి ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా బుకింగ్స్.. మూలా నక్షత్రం నాడు సర్కార్ సేవగా పూజలు!బందరులో ‘జనసేనాని’ పత్రిక కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్ ప్రసంగం: జనసేన సిద్ధాంతాలే సమాజానికి మార్గదర్శకం.. కొట్టె వెంకటరావు నేతృత్వంలో ఘనంగా సభ!అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి NHAI గ్రీన్ సిగ్నల్: 4 ప్యాకేజీల కింద భారీ టెండర్ల ఆహ్వానం.. 195 కిలోమీటర్ల మేర 6 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం!మృత్యుకుహరంగా మారిన 216 జాతీయ రహదారి: నిత్యం నెత్తురోడుతున్న కోస్తా హైవే.. మార్జిన్ల ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంతో గాల్లో కలుస్తున్న నిండు ప్రాణాలు!ఎల్-నినో ముసుగులో నిత్యావసరాల దోపిడీ: ధరలు మండిపోతున్నా చర్యలేవీ?.. మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగాలని ప్రజల డిమాండ్!జక్కంపూడి రాజాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ: అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల సంబరాలు🚨 నేడు భీమిలిలో వైసీపీ కీలక సమావేశంప్రొద్దుటూరులో నేడు జల్ జీవన్ మిషన్ 2.0విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలు 2026: అక్టోబర్ 11 నుంచి 20 వరకు వైభవంగా నవరాత్రులు.. అమ్మవారి 10 విశేష అలంకారాలు, దర్శన సమయాల షెడ్యూల్ విడుదల!కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి దశదిన కర్మలో జనసేన నేతల నివాళి: చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన జనసేన రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త!ఇంద్రకీలాద్రిపై దసరా ప్రత్యక్ష విశేష పూజా టికెట్ల విడుదల: అక్టోబర్ 5 సాయంత్రం నుంచి ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా బుకింగ్స్.. మూలా నక్షత్రం నాడు సర్కార్ సేవగా పూజలు!బందరులో ‘జనసేనాని’ పత్రిక కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్ ప్రసంగం: జనసేన సిద్ధాంతాలే సమాజానికి మార్గదర్శకం.. కొట్టె వెంకటరావు నేతృత్వంలో ఘనంగా సభ!అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి NHAI గ్రీన్ సిగ్నల్: 4 ప్యాకేజీల కింద భారీ టెండర్ల ఆహ్వానం.. 195 కిలోమీటర్ల మేర 6 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం!
ఆంధ్ర

పెడనలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్… టీడీపీలోకి మాజీ కౌన్సిలర్ మెహరున్నిసా కుటుంబం

pedana-yCP-former-councillor-mehrunnisa-joins-tdp-kagita-krishna-prasad

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా పెడన పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెడన పట్టణం ఐదవ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ కౌన్సిలర్ శ్రీమతి మెహరున్నిసా మరియు ఆమె కుటుంబ సభ్యులు ఆ పార్టీని వీడి అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సమక్షంలో వారందరూ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని కూటమి పార్టీలోకి అడుగుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని, సంక్షేమం మాటలకే పరిమితమైందని వారు ఈ సందర్భంగా విమర్శించారు.

పార్టీలోకి చేరిన మాజీ కౌన్సిలర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే తాము టిడిపిలో చేరామని స్పష్టం చేశారు. పెడన నియోజకవర్గంలో శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా నిలుస్తామని, పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Related News Desk మృత్యుకుహరంగా మారిన 216 జాతీయ రహదారి: నిత్యం నెత్తురోడుతున్న కోస్తా హైవే.. మార్జిన్ల ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంతో గాల్లో కలుస్తున్న నిండు ప్రాణాలు!

కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అందరి సహకారంతో పెడన నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకువెళ్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం పరిశీలకులు షేక్ ఆషా, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పెడన పట్టణ అధ్యక్షులు యక్కల శ్యామలయ్య, వార్డు ఇంచార్జ్ రహేమాన్ బేగ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యుమ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Slug: pedana-ypc-former-councillor-mehrunnisa-joins-tdp-kagita-krishna-prasad