జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నం పంచాయతీలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెన్కే వెంకటేష్ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం మరియు శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాకినాడ మాజీ మేయర్ మరియు ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని తిరుమల కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తల ఉత్సాహభరిత నడుమ జరిగిన ఈ వేడుకల్లో పలు సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో ఉత్సాహం నింపారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ ఉత్సవంలో భాగంగా గర్భవతులకు సాంప్రదాయబద్ధంగా సీమంతాలు జరిపి, వారికి పౌష్టికాహార కిట్లను అందజేశారు. అలాగే సమాజ ఆరోగ్య పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ వారిని శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి సందడి చేశారు. చినరాజప్ప ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Slug: peddapuram-mla-nimmakayala-chinarajappa-birthday-celebrations-sunkara-pavani
