జన గళం హైదరాబాద్ బ్యూరో: ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం మించిన మహత్తర సేవ మరొకటి లేదని ప్రముఖ ఫార్మా సంస్థ సుసాహ్ ల్యాబొరేటరీస్ (Susaah Laboratories) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కే. శ్రీనివాస్ చాటిచెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక చిరంజీవి ఐ & బ్లడ్ సెంటర్‌ను సందర్శించి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
సమాజ సేవలో నిరంతరం ముందుంటూ, అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలను నిలిపేందుకు ముందుకు వచ్చిన ప్రముఖ సంఘ సేవకులు శ్రీ కే. శ్రీనివాస్‌కు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి తరఫున చిరంజీవి బ్లడ్ సెంటర్ నిర్వాహకులు, వైద్య సిబ్బంది హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత, ప్రముఖులు కే. శ్రీనివాస్‌ను ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీనివాస్ గారిని, వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని చిరంజీవి ఐ & బ్లడ్ సెంటర్ ప్రతినిధులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
