ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు
- విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్ష
- ప్రకృతిని కాపాడుకుంటూ మట్టి గణపతులనే పూజిద్దాం: అమ్మిశెట్టి వాసు పిలుపు
విజయవాడ:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు విజయవాడ ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి, కూటమి శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి ప్రతి కార్యంలో విజయాన్ని అందించే ఆ గణపయ్య కృపాకటాక్షాలతో ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ప్రశాంతత వెల్లివిరియాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మన ప్రశాంతతతో పాటు ప్రకృతినీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేస్తూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులు పర్యావరణ హితమైన మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యావరణ పరిరక్షణ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన కోరారు
