జన గళం విజయవాడ బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం శ్రీ కనకదుర్గమ్మ వారు వేదమాత ‘శ్రీ గాయత్రీ దేవి’ విశేష దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపిణిగా, జ్ఞానప్రదాయినిగా భాసించే గాయత్రీ దేవి అవతార దర్శనం కోసం వేకువజాము నుంచే తెలుగు రాష్ట్రాలు సహా దేశం నలుమూలల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. సర్వపాపహరిణిగా, ఆయురారోగ్యాలు, బుద్ధి వికాసాన్ని ప్రసాదించే తల్లిని దర్శించుకునేందుకు క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి పునీతమవుతోంది.
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా నవరాత్రులు: రెండవ రోజు భక్తులకు ‘శ్రీ గాయత్రీ దేవి’గా దర్శనమిస్తున్న జగన్మాత!
Slug: indrakeeladri-dasara-navaratri-day-2-sri-gayatri-devi-alankaram-kanaka-durga-temple
