జనగళం 24 ఆంధ్ర డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని గుంటూరు నగరంలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి ఎంపీ స్వయంగా వెళ్లారు.
శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సూచించిన జాగ్రత్తలు, చికిత్స వివరాలపై ఆరా తీశారు. కన్నా లక్ష్మీనారాయణ త్వరగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో కోలుకుని, యథావిధిగా ప్రజాసేవలో మునుపటి ఉత్సాహంతో పాల్గొనాలని ఎంపీ బాలశౌరి ఆకాంక్షించారు.
