జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు మండలం ఆకులమన్నాడు – నారికేడల పాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి బాకీ లీలా పావని తరుఫున నాయకులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పెడన నియోజకవర్గం సమన్వయకర్త అంకెం లక్ష్మీ శ్రీనివాస్, మచిలీపట్నం పార్లమెంట్ సమన్వయ కమిటీ మెంబర్ నల్లమోతు రఘురామ్ తదితర కూటమి నేతలు పాల్గొని స్థానిక ఓటర్లను కలిశారు.
ఈ సందర్భంగా కూటమి నేతలు ప్రజలను నేరుగా కలుసుకుని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆకులమన్నాడు – నారికేడల పాలెం ఎంపీటీసీ సెగ్మెంట్‌లో జనసేన అభ్యర్థి బాకీ లీలా పావనిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
స్థానిక సమస్యల పరిష్కారం మరియు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి పనిచేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఊపేర్పరిచారు.
