జన గళం విజయవాడ బ్యూరో: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ (APMSMEDC) చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి జన్మదినం సందర్భంగా పార్టీ వర్గాలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గ మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు గారు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ బెజవాడ కనకదుర్గ అమ్మవారి దివ్య ఆశీస్సులు శివశంకర్ గారిపై ఎల్లవేళలా ఉండాలని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, పార్టీ పటిష్టతకు శివశంకర్ గారు అందిస్తున్న నిరంతర సేవలు మరింత కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
